![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -264 లో... నర్మద సంతోషంగా ఇంటికి వస్తుంది. అత్తయ్య గుడ్ న్యూస్ అని చెప్తుంది. నెలతప్పావా అని వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. అది చూసి ఇదేంటి ఆ నర్మద నా కంటే ముందుగా నెలతప్పిందని శ్రీవల్లి కుళ్ళుకుంటుంది. అదేం లేదు అత్తయ్య నాకు ప్రమోషన్ వచ్చిందని నర్మద చెప్పగానే వేదవతి మురిసిపోతుంది. హమ్మయ్య నెల తప్పలేదని శ్రీవల్లి రిలాక్స్ అవుతుంది. వెంటనే ఈ విషయం ప్రేమకి చెప్పాలని ప్రేమ దగ్గరికి బయల్దేరతారు.
ఆ తర్వాత శ్రీవల్లి పానీపూరి తింటుంది. శ్రీవల్లిని కలవడానికి భాగ్యం ఆనందరావు వెళ్తుంటే పానీపూరి దగ్గర తనే కనిపిస్తుంది. ఇక భద్రవతి వచ్చిన విషయం చెప్తారు. నువ్వే ఆ విశ్వకి అమూల్యకి ప్రేమ రాయబారం నడిపించాలి. అలా చేస్తే నీ భర్తకి ఇవ్వాలసిన పదిలక్షలు ఇస్తారని భాగ్యం చెప్తుంది. నేను అలా చేయను ఇంకా సమస్య తెచ్చుకోనని శ్రీవల్లి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు ప్రేమ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే.. నర్మద, వేదవతి వెళ్తారు. ఏమైంది డల్ గా ఉన్నావని అడుగుతారు. నా హ్యాపీనెస్ ని నీతో షేర్ చేసుకుందామని వచ్చాను కానీ నువ్వు ఇలా ఉన్నావని నర్మద అంటుంది. హ్యాపీనెస్ ఏంటని ప్రేమ అడుగుతుంది. నాకు ప్రమోషన్ వచ్చిందని చెప్తుంది. దాంతో ప్రేమ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఇప్పుడు చెప్పు.. నీ ప్రాబ్లమ్ అని నర్మద అడుగుతుంది. అదేం లేదని ప్రేమ అంటుంటే.. ధీరజ్ కి నర్మద ఫోన్ చేసి ప్రేమ ఎందుకు టెన్షన్ పడుతుంది కనుక్కోమని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి ధీరజ్ వస్తాడు. ప్రేమ వెళ్తుంటే నేను డ్రాప్ చేస్తానని ధీరజ్ అంటాడు. కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడ ఆపమని ప్రేమ అంటుంది. ప్రేమ బైక్ దిగి వెళ్లిపోతుంటే ఎక్కడికి అని ధీరజ్ అడుగుతాడు. నాకు పని ఉందని చెప్పి ప్రేమ వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |